ఒకేఒక్క ఆలోచన నన్ను ఇన్నేళ్లుగా నడిపిస్తోంది: షారూక్ ఖాన్

  • 52వ బర్త్ డే జరుపుకున్న షారూక్
  • కుటుంబీకులు, మిత్రుల సమక్షంలో వేడుకలు
  • ఈ దశలో పెద్దగా ఆశలు, కోరికలు లేవన్న బాద్ షా
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన 52వ బర్త్ డే వేడుకలు ఈరోజు జరుపుకున్నాడు. ముంబైలోని అలీబాగ్ లో ఉన్న తన ఫాం హౌస్ లో తన కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో షారూక్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షారూక్ మాట్లాడుతూ, ప్రేక్షకులను వినోదపరచాలనే ఒకే ఒక్క ఆలోచన తనను ఇన్నేళ్లుగా నడిపిస్తూ వస్తోందని, ఆ ఆలోచనే కనుక లేకపోతే ఆసక్తిపోతుందని అన్నాడు.  

ఈ దశలో తనకు ఆశలు, కోరికలు పెద్దగా లేవని, బంగారం లాంటి కుటుంబం తనకు ఉందని చెప్పాడు. తనకు డబ్బు, పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాలే కాకుండా మంచి ఆరోగ్యం కూడా ఉందని, ఈ విషయంలో దేవుడు తనను చల్లగా చూశాడని భావోద్వేగం చెందాడు. తన స్టార్ డమ్ ఈరోజు లేదా మరో ఐదేళ్ల తర్వాతో ముగిసిపోవచ్చని, ఆ రోజు వస్తే జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని, తనను తెరపై చూసే ప్రేక్షకులు, అభిమానులు సంతృప్తి చెందాలని అన్నారు.
Go Back to Shorts
Shah Rukh Khan

More Telugu News